‘ఉగ్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews Uncategorized

విడుదల తేదీ : మే 5 2023

తారాగణం : అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శత్రు తదితరులు, ఊహా రెడ్డి తదితరులు

దర్శకత్వం : విజయ్ కనకమేడల

సంగీతం : శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ జె

నిర్మాత : సాహు గారపాటి & హరీష్ పెద్ది

నిర్మాణ సంస్థ : ‘షైన్ స్క్రీన్స్’

అల్లరి నరేష్ అంటే కామెడీ మాత్రమే చేయగలడు అనేది అపోహ అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. కామెడీ బాగా చేయగల హీరో ఎటువంటి పాత్రకైనా న్యాయం చేయగలడు అని అతను ప్రతిసారి చెబుతూనే ఉంటాడు. ‘మహర్షి‘ ‘నాంది’ చిత్రాలు కొత్త నరేష్ ను చూపించాయి . ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా నిరాశపరిచినా సీరియస్ రోల్స్ చేయడానికి నరేష్ వెనుకాడటం లేదు. లేటెస్ట్ గా వచ్చిన ‘ఉగ్రం’ కూడా నరేష్ లోని ఇంటెన్సిటీని చూపించనున్నట్టు టీజర్, ట్రైలర్లు చెప్పాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

‘ఉగ్రం’ కథ విషయానికి వస్తే.. శివ కుమార్ (అల్లరి నరేష్) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఓ యాక్సిడెంట్ వల్ల తన భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు(ఊహా రెడ్డి) మిస్ అవుతారు. అలాగే యాక్సిడెంట్‌లో శివ తలకు దెబ్బ తగలడం వల్ల అతనికి డిమెన్షియా అనే వ్యాధి వచ్చిందని, అందుకే భార్య, కూతురు లేకపోయినా అలా ఊహించుకుంటున్నాడని డాక్టర్ (ఇంద్రజ) చెబుతుంది. హాస్పిటల్‌కు తీసుకురాకపోతే అపర్ణ, తన కూతురు ఏమయ్యారు? దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అనేది కథ.

‘మిస్సింగ్ కేసులు’ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు విజయ్ ఎంచుకోవడం మంచి ప్రయత్నమే. కొన్ని మంచి సన్నివేశాలు కూడా రాసుకున్నాడు. కానీ చాలా చోట్ల ల్యాగ్ ఉన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఎందుకంటే కథ నుండి డైవర్ట్ అయ్యేలా కొన్ని సంబంధం లేని ట్రాకులు రాసుకోవడం వల్లనే అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ఇంకాస్త పగడ్బంధీగా రాసుకోవాల్సింది. హీరో నరేష్ వరకు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు.యాక్షన్ సన్నివేశాల్లో నిజంగానే తన ఉగ్ర రూపాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మిర్నా మీనన్ తనకు ఉన్న స్క్రీన్ స్పేస్ కు తగ్గట్టు బాగానే చేసింది. ఆమె లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక చిన్న పాప ఊహా రెడ్డికి కూడా మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. ఇక శత్రు, ఇంద్రజ పాత్రలు జస్ట్ ఓకే అనే విధంగా ఉన్నాయి. అయితే ‘నాంది’ సినిమాలో వరలక్ష్మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సినిమా సక్సెస్ లో ఆ పాత్ర చాలా ముఖ్య పాత్ర పోషించింది. ‘ఉగ్రం’ లో అలాంటి పాత్ర మిస్ అవ్వడం కూడా ‘నాంది’ రేంజ్లో ఈ మూవీ లేదు అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

ఓవరాల్ గా ‘ఉగ్రం’ సినిమా అల్లరి నరేష్ కోసం తప్పకుండా ఒకసారి చూడొచ్చు. కాకపోతే దర్శకుడు విజయ్ తీసిన ‘నాంది’ ని దృష్టిలో పెట్టుకోకుండా చూస్తే బెటర్.

Read more : ‘రామబాణం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *