గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకధీర రాజమౌళి..ల ఇండస్ట్రీ హిట్ మూవీ ‘మగధీర’ రీ-రిలీజ్

News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి ఓ పెద్ద గిఫ్ట్ అందబోతుంది. రాంచరణ్ కెరీర్లో మొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘మగధీర’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని మార్చి 26న రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.

‘శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్’ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు… ‘ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని భావిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *