shilpa reddy : ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి గొప్ప మనసు

News

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కమ్ మాజీ మిసెస్ ఇండియా అలాగే ఫిట్‌నెస్ సెంటర్ బిజినెస్ లో రాణిస్తున్న శిల్పా రెడ్డి ఈరోజు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎటువంటి లాభాపేక్షలేకుండా రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ అనే సంస్థని స్థాపించారు. మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించేందుకు ఈ సంస్థని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభించేందుకు కూడా ఈ సంస్థ రెడీ అయ్యింది. విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతపై దృష్టి సారించి, భవిష్యత్ తరాలకు మరింత స్థిరమైన మరియు సమానమైన అవకాశాలు కలిగిన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ సంస్థ కృషి చేయనుంది.

మరోపక్క ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారు 26 ఫిబ్రవరి 2024న ప్రారంభించిన ముషీరాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం SRD (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్)కి 12 లక్షల విలువైన జిమ్ పరికరాలను విరాళంగా ఇవ్వడం ద్వారా ఇప్పటికీ ఆర్.ఎస్.ఎఫ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్టు స్పష్టమవుతుంది.

ఈ సందర్భంగా శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. “నా జీవిత ప్రయాణంలో, నేను సంపూర్ణ జీవితం అనుభవించిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి సమాజానికి తిరిగి ఏదైనా చేయాలని నేను సమయం కోసం కనిపెడుతున్నాను. విద్య,ఉపాధి ద్వారా మహిళలకు స్వేచ్ఛ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా, మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు వారి జీవితాల్లో నైపుణ్యాలను వెలిగితీయడం కొరకు కూడా నేను అంకితభావంతో పనిచేస్తాను…” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *