adipurush trailer : ట్రోలింగ్ కు ధీటైన సమాధానమిచ్చిన ప్రభాస్..!

News Uncategorized

‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్ క్లూజన్’ చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ రాష్ట్రాలు దాటింది అనే విషయాన్ని ‘సాహో’ కలెక్షన్స్ నిరూపించాయి. అయితే ‘రాధే శ్యామ్’ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇదే క్రమంలో ‘ఆదిపురుష్’ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘ఆదిపురుష్’ చిత్రం దారుణమైన ఫ్లాప్ అవ్వడం ఖాయమని అంతా కామెంట్లు చేశారు. ప్రభాస్ అభిమానులు సైతం ‘ఆదిపురుష్’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి ఓటీటీ ఇచ్చేస్తే బెటర్ అని.. ‘సలార్’ పైనే ఆశలు పెట్టుకుంటున్నట్టు కామెంట్లు చేశారు. మరికొంతమంది అయితే రాముడికి మీసాలు ఉండడమేంటి? అంటూ కూడా కామెంట్లు చేశారు.

 

కానీ తాజాగా రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఆ కామెంట్లకు బ్రేక్ వేసింది. వాస్తవానికి రాముడికి మీసాలు ఉండవు అని ఎక్కడా రాసిపెట్టి లేదు. గతంలో వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్.. అలా కనిపించే సరికి అందరూ హీరోలు అదే పద్ధతిని అనుసరించారు. అయితే ‘ఆదిపురుష్’ ట్రైలర్ బాగుండడంతో నెగిటివ్ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అలాగే ఈ జెనరేషన్ కు రాముడి గొప్పతనాన్ని, ‘రామాయణం’ మోరల్స్ ను అందంగా చెప్పాలంటే ప్రభాస్ వంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోనే కరెక్ట్ అని అందరికీ చాటి చెప్పింది ఆదిపురుష్ ట్రైలర్. బాలీవుడ్లో 52 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి ‘ఆదిపురుష్’ నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది. జూన్ 16న రిలీజ్ అయ్యే ఈ సినిమా పై నార్త్ లో భారీ అంచనాలు నెలకొన్నాయనే విషయం.. ‘ఆదిపురుష్’ ట్రైలర్ అందరికీ తెలియజేసింది.

 

Read more : ఉగ్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *