‘రామబాణం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews Uncategorized

విడుదల తేదీ : మే 5 2023

తారాగణం : గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు, ఖుష్బూ సుందర్, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేదేఖర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు

దర్శకత్వం : శ్రీవాస్

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫీ : వెట్రి పలనిసామి

నిర్మాత : టి.జి.విశ్వప్రసాద్

నిర్మాణ సంస్థ : ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’

‘సీటీమార్’ తో హిట్టు కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ వెంటనే ‘పక్కా కమర్షియల్’ అనే ప్లాప్ ను మూటగట్టుకున్నాడు గోపీచంద్. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాలని భావించి ‘రామబాణం’ చిత్రం చేశాడు. తనకు ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి రెండు సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ ‘రామబాణం’ తో గోపీచంద్ హిట్టు కొట్టి ఫ్లాప్స్ నుండి బయటపడ్డాడా లేదా? అన్నది తెలుసుకుందాం రండి :

కథ విషయానికి వస్తే రఘుదేవ పురం అనే గ్రామం.. అక్కడ రాజారాం (జగపతి బాబు) అనే గొప్ప సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. రాజారాం అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) తో కలిసి ఓ ఆర్గానిక్ హోటల్ బిజినెస్ చేస్తాడు. రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడే అతనితో గొడవ పెట్టుకుని ఊరు వదిలి పారిపోతాడు. అలా వెళ్లిపోయిన అతను కోల్ కతాలో పెద్ద డాన్ గా అవుతాడు. అక్కడ భైరవితో (డింపుల్ హయతి) ప్రేమలో పడతాడు. కానీ కుటుంబం ఉంటేనే భైరవిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి (సచిన్ ఖేడ్కర్) విక్కీకి కండిషన్ పెడతాడు. దీంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ తన అన్న, వదినలు వద్దకు వెళ్తాడు. అయితే తన అన్న జీకే (తరుణ్ అరోరా) వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో విక్కీ తన అన్నకి అండగా నిలబడ్డాడా లేదా? చివరికి ఏమైంది అనేది కథ.

సాధారణంగా ఏ హీరోకైనా కొన్ని బలాలు ఉంటాయి. గోపీచంద్ కు కూడా మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అనేవి బలాలు. గోపీచంద్ కటౌట్ ను వాడుకుని సూపర్ హిట్లు కొట్టే ఛాన్స్ ఉన్నా చాలా మంది దర్శకులు దానిని సరిగ్గా వాడుకోవడం లేదు. గోపీచంద్ కు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ కు కూడా ఈ విషయం అర్ధం కాలేదు అని ‘రామబాణం’ తో ప్రూవ్ అయ్యింది.

గోపీచంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే సినిమా చేద్దామంటే ఫేడౌట్ అయిపోయిన భూపతి రాజా వద్ద కథ తెచ్చుకుని తనకు నచ్చినట్టు మార్పులు చేసి తీసేసాడు కానీ గోపీచంద్ బలాలను పక్కన పెట్టేసాడు. అందువల్ల ‘రామబాణం’ ఆద్యంతం రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. గోపీచంద్ అభిమానులను కూడా సంతృప్తి పరిచే సినిమా కాదిది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ తప్ప .. ‘రామబాణం’ లో ప్రత్యేకంగా చెప్పుకునే ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవనే చెప్పాలి

రేటింగ్ : 2/5

Read more : arangetram review : ‘అరంగేట్రం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *