Ugram:’ఉగ్రం’.. ‘నాంది’ కి పదిరెట్లు ఉంటుంది

News

‘నాంది’ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేశాడు. అది ప్లాప్ అయ్యింది. త్వరలో ‘ఉగ్రం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘నాంది’ అల్లరి నరేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు.’షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మిర్నా మీనన్ హీరోయిన్ గా నటిచింది. టీజర్, ట్రైలర్ లు బాగానే ఉన్నాయి. మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో నిన్న ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట ఈ వేడుకకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఈ క్రమంలో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “ఉగ్రం నా 60వ సినిమా.నా ఈ జర్నీలో చాలా మంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు భాగం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘నాంది’కి పని చేసిన టీం దాదాపుగా ‘ఉగ్రం’కి పని చేసింది. విజయ్, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే ‘నాంది’కి మించి ఉండాలని భావించాం. ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు విజయ్, సిద్, అబ్బూరి రవి గారు, శ్రీచరణ్ .. అందరూ కష్టపడి పని చేశారు. మిర్నా చక్కగా నటించింది. మా నిర్మాతలు సాహు గారు హరీష్ గారు ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ, ప్రతి కార్మికుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వేడుకు వచ్చిన అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు శివ నిర్వాణ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, విఐ ఆనంద్ .. అందరికీ స్పెషల్ థాంక్స్. ‘ఉగ్రం’ కోసం 73 రోజుల పాటు రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేశాం. ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్, ప్రుద్వి మాస్టర్ వెంకట్ మాస్టర్ .. చాలా కష్టపడ్డారు. ఇందులో 6 ఫైట్లు ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ‘కితకితలు’ పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్ కు గురిచేశాను. కానీ ఇందులో నా ‘ఉగ్ర రూపం’ చూస్తారు. నాంది ని గొప్పగా ఆదరించారు. దానికంటే కంటే పదిరెట్లు ఈ సినిమాని ఆదరిస్తారని ఆదరించాలని, మే 5న అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read more : agent review : ఏజెంట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *