custody review : ‘కస్టడీ’ మూవీ రివ్యూ

Reviews News Uncategorized

విడుదల తేదీ : మే 12 2024
తారాగణం : అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, గోపరాజు రమణ, ‘వెన్నెల’ కిశోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

దర్శకత్వం : వెంకట్ ప్రభు
సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : ఎస్ఆర్ కతీర్
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు. నాగార్జున ‘ఘోస్ట్’ సినిమా డిజాస్టర్ అయ్యింది. అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యింది. వీటికి ముందు నాగ చైతన్య చేసిన ‘థాంక్యూ’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సో ఆ ప్లాపుల నుండి నాగ చైతన్య బయటపడాలి అనే ఉద్దేశంతో ‘కస్టడీ’ అనే యాక్షన్ మూవీ చేశాడు. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ‘కస్టడీ’ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుండా లేదా? తెలుసుకుందాం రండి :

‘కస్టడీ’ కథ ఏంటి అన్నది ట్రైలర్లోనే చెప్పేశారు. శివ అనే కానిస్టేబుల్… ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్లి.. ఆంబులెన్స్ కు దారివ్వడానికి ముఖ్యమంత్రి కారునే ఆపేస్తాడు. మరోపక్క హీరోయిన్ తో ప్రేమ. పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడిన పెద్దలు. ఆమె కోసం వెళ్తున్న టైంలో విలన్ తగలడం. విలన్ ను కోర్టుకు అప్పగించాలి అనే ఉద్దేశంతో హీరో ఫైట్ చేయడం.. ఇదే కథ.కాకపోతే కొంత రివేంజ్ డ్రామాని యాడ్ చేశాడు.

కథ ఎలాంటిది అయినప్పటికీ దర్శకుడు వెంకట్ ప్రభు తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తుంటాడు అన్న పేరుంది. ఈ కస్టడీ విషయంలో ఇది కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ కొంత వరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ లో చాలా వరకు చూసిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నామేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంది. కంప్లీట్ గా వెంకట్ ప్రభు చేసిన తప్పులే ‘కస్టడీ’ ని ఫెయిల్యూర్ బాట పట్టించాయి అని చెప్పాలి.

హీరో నాగ చైతన్య చాలా బాగా నటించాడు. ప్రతి సినిమాకి కూడా నటుడిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అరవింద స్వామి వంటి స్టార్ నటుడితో కూడా పోటీపడి మరీ నటించాడు. కాలేజ్ ఎపిసోడ్ కు సంబందించిన విజువల్స్ లో నాగార్జునలా కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. సినిమాలో ప్రియమణి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ దర్శకుడు వెంకట్ ప్రభు… ఎవ్వరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే, కానీ పాటలు ఏమాత్రం కూడా జనాలను ఆకట్టుకోవు.

ఫైనల్ గా.. ‘ఘోస్ట్’ ‘ఏజెంట్’ సినిమాలంతా దారుణంగా అయితే ‘కస్టడీ’ ఉండదు. అలా అని వెంకట్ ప్రభు సినిమాల రేంజ్ లో కూడా అలరించదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు.. సెకండ్ హాఫ్ ను కొంచెం భరించగలిగితే ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Read more : adipurush trailer : ట్రోలింగ్ కు ధీటైన సమాధానమిచ్చిన ప్రభాస్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *