indrani making video

Indrani : `ఇంద్రాని` మేకింగ్ వీడియో చూసారా?

News

 

Indrani : ఇండియాలో మొట్టమొదటి సూప‌ర్ గ‌ర్ల్ మూవీ `ఇంద్రాణి` షూటింగ్  ప్ర‌స్తుతం హైదరాబాద్ మరియు ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు స్టీఫెన్. ఈయనకి ద‌ర్శ‌కుడిగా ఇదే మొదటి చిత్రం.స్టాన్లీ సుమ‌న్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహాన్‌ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న…  ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సినిమా కోసం 2 సంవత్సరాలకు పైగా ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్, డీటైల్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో  VFX ప్లానింగ్ జరిగింది. దీంతో చిత్రీకరణ ఫాస్ట్ గా జరగడానికి దోహదపడింది. వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్ ప‌నులు కూడా షూటింగ్ తో సమానంగా జరిగిపోతున్నాయి.తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు దర్శకుడు.ముందు ముందు మరిన్ని యాక్షన్ స్టంట్‌లతో మేకింగ్ వీడియోలను విడుదల చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు.

బ్యాన‌ర్‌: శ్రే మోష‌న్ పిక్చ‌ర్స్‌
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం,నిర్మాత‌: స్టీపెన్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌: స్టాన్లీ సుమ‌న్‌బాబు
మ్యూజిక్‌: సాయి కార్తిక్
కో-డైరెక్ట‌ర్: సాయి త్రివేది
డిఓపి: చరణ్ మాధవ నేని
ఎడిటర్: ఎస్‌.బి ఉద్ద‌వ్‌
యాక్ష‌న్‌ డైరెక్టర్: ప్రేమ్ సన్
ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *