anni manchi sakunamule review :’అన్నీ మంచి శకునములే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Reviews News Uncategorized

విడుదల తేదీ : మే 18 2023

తారాగణం : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు తదితరులు

దర్శకత్వం : బివి నందినీ రెడ్డి
సంగీతం : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
నిర్మాత : ప్రియాంకా దత్
నిర్మాణ సంస్థ : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్

‘వర్షం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శోభన్ కు ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. ‘పేపర్ బాయ్’ ‘ఏక్ మినీ కథ’ ‘మంచి రోజులు వచ్చాయి’ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ ‘కళ్యాణం కమనీయం’ ‘శ్రీదేవి శోభన్ బాబు’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో ‘ఏక్ మినీ కథ’ తప్ప మిగిలిన సినిమాలు నిరాశపరిచాయి. అది కూడా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి.. ఆ మూవీ సేఫ్ అయ్యింది. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి ‘అన్నీ మంచి శకునములే’ సినిమా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

రెండు కుటుంబాల మధ్య ఓ గొడవ.. దాని వెనుక జరుగుతున్న కోర్టు కేసు ఒక సమస్య అయితే.. హీరో, హీరోయిన్లు చిన్నప్పుడే ‘అల వైకుంఠపురములో’ టైపులో ప్లేస్ లు మారిపోవడం మరో సమస్య… ఈ రెండు సమస్యల నేపథ్యంలో రూపొందిన కథ ఇది. చివరికి ఏమైంది? అనేది తెర పై చూసి తెలుసుకోవాలి.

కథ కొత్తదేమీ కాదు. ఆ విషయానికి వస్తే ఇప్పుడొస్తున్న సినిమాల కథలేవీ కూడా కొత్తగా ఉండట్లేదు. మొత్తం కథనం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అలాగే చేయాలి. అయితే ఈ విషయంలో నందినీ రెడ్డి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. లాక్ డౌన్ కు ముందు సక్సెస్ లు కొట్టిన డైరెక్టర్లు లాక్ డౌన్ తర్వాత ప్లాపులివ్వడం అనే సెంటిమెంట్ టాలీవుడ్లో కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం దర్శకులు.. మారిన ప్రేక్షకుల టేస్ట్ ను క్యాచ్ చేయకపోవడం వల్ల. నందినీ రెడ్డి కూడా అలాగే వెనుకపడింది. నిర్మాతలు హద్దులు పెట్టుకోకుండా ఈ సినిమాకి బాగా ఖర్చు చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని కామెడీ సీన్లు బాగున్నాయి. ఇవి కాకుండా.. మిగిలినదంతా కూడా బాగా ల్యాగ్ అలాగే బోర్ కొడుతోంది అనే చెప్పాలి.

ఇలాంటి బిలో యావరేజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అన్నది అంచనా వేయలేం. చూస్తుంటే సంతోష్ శోభన్ ఓ కమర్షియల్ హిట్ అందుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ‘విరూపాక్ష’ తర్వాత తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు వచ్చినవి వచ్చినట్టు ప్లాప్ అవుతున్నాయి. ‘అన్నీ మంచి శకునములే’ ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేస్తుంది అనుకుంటే.. కంటెంట్ పరంగా ఆ స్థాయిలో లేదు. బాక్సాఫీస్ రిజల్ట్ తో ఏమైనా ఆ ఫీట్ ను సాధిస్తుందేమో.. వీకెండ్ కలెక్షన్లను బట్టి అంచనా వేయగలం.

 

Read more : custody review : ‘కస్టడీ’ మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *