why god father failed at the box office

God Father : ‘గాడ్ ఫాదర్’ ఆడకపోవడానికి కారణాలు ఏంటి?

News

మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు చూసేయాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. కానీ దసరా రోజున అంటే అక్టోబర్ 5న రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ సినిమా హిట్ టాక్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్టే. ఎందుకంటే రెండో వారం ఈ మూవీకి పోటీ లేదు అనుకుంటే ‘కాంతారా’ అనే ముక్కు మొహం తెలియని హీరో సినిమా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఆ సినిమా దీపావళికి రిలీజ్ అయ్యే సినిమాల ఓపెనింగ్స్ ను కూడా దెబ్బ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సరే ఆ విషయాలను పక్కన పెట్టేసి మెగాస్టార్ గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం :

1) ముందుగా ఇది తెలుగులో ఆల్రెడీ డబ్ అయిన సినిమా. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా కనుక వచ్చి ఉంటే ఈ టాక్ కు మినిమం గ్యారెంటీ సినిమాగా నిలిచేది. కానీ లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న జనాలు ఆ సినిమాని తెగ చూసేసారు. ఆ సినిమా అనే కాదు అన్ని భాషల్లోని సినిమాలను తెగ చూసేసారు.

2)రెండోది దర్శకుడు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశాడు. అతను మంచి దర్శకుడు అని సోషల్ మీడియా ఫాలో అయ్యే జనాలకు తెలుసు. 20 ఏళ్ళ క్రితం అతను ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాని తీసాడు అన్న సంగతి చాలా మందికి తెలీదు. అదే వినాయక్ లాంటి దర్శకులు అయితే కనుక మూవీ బిజినెస్ కు బాగా హెల్ప్ అయ్యేది. జనాల్లో కూడా అంచనాలు పెరిగేవి. అలా అని మోహన్ రాజా రాంగ్ సెలక్షన్ ఎంత మాత్రం కాదు. జనాల్లో ఆసక్తి లేకపోవడం అనేది అతనికి గురించి ఎక్కువ మందికి తెలీక అంతే.

3) మూడో కారణం.. ‘గాడ్ ఫాదర్’ కథలో మార్పులు చేయడానికే ఎక్కువ శ్రద్ద పెట్టారు కాని.. చిరు నుండి జనాలు ఆశించే మినిమం ఎలిమెంట్స్ ను కూడా పెట్టడం మానేశారు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్, ఇంటర్వెల్ సీన్ తప్ప చిరు ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్స్ లేవు.

4)విలన్ చాలా వీక్.సత్యదేవ్ వంటి పిల్ల హీరోని విలన్ గా చేసినంత మాత్రాన… అతన్ని అంతమొందించడానికి చిరు, సల్మాన్ ఖాన్ వంటి ఇద్దరు బడా స్టార్లు గన్నులు కాల్చుకుంటూ, డెన్ లు పేల్చుకుంటూ రావాలా అనే థాట్ అందరిలోనూ ఉంటుంది.

5) రీమేక్ చేసేప్పుడు ఒరిజినల్ లో మిస్ అయిన కొన్ని క్లారిటీలు ఇవ్వాలి. ఇక్కడ అన్నీ ఇచ్చారు, కొన్ని లేపేశారు కానీ చిరు గతమేంటి? అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది వంటి విషయాలను చెప్పలేదు. ఇది తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేని విషయం.

6)అన్నీ ఓకే అనుకున్నా.. ‘ఆచార్య’ ఫలితం చిరు అభిమానులను బాగా భయపెట్టేసింది. ఇక చిరు సినిమాలను ఓటీటీలోనే చూస్తే బెటర్ అని ఓ సెక్షన్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు అంటే అందులో విడ్డూరం ఏమీ లేదు.

 

Read more : తేడా కొడుతున్న ‘‘చిరు’’ సినిమాలు, ఇక వినయ్ దిగాల్సిందేనా.. మెగా క్యాంప్‌లో అంతర్మథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *