bichagadu2 review : ‘బిచ్చగాడు2’  మూవీ రివ్యూ అండ్ రేటింగ్ 

Reviews News Uncategorized

విడుదల తేదీ : మే 19, 2023
తారాగణం : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు తదితరులు

దర్శకత్వం : విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : ఓమ్ నారాయణ్
నిర్మాత : ఫాతిమా విజయ్ (విజయ్ ఆంటోనీ భార్య)
నిర్మాణ సంస్థ : విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్

సమ్మర్ అంతా డల్ గానే ఉంది. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు అని బాధపడుతున్న ప్రేక్షకులకు ‘బిచ్చగాడు 2 ‘ ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ ను కలిగించింది అని చెప్పాలి. ఎందుకంటే 2016 లో వచ్చిన ‘బిచ్చగాడు‘ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలీదు. అలాంటిది ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా బయ్యర్స్ కు భారీ లాభాలను అందించింది. ఇప్పటికీ ఆ చిత్రం టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది అంటే కథలకుండా చూసే జనాలు ఉన్నారు. అలాంటి ‘బిచ్చగాడు’ సీక్వెల్ గా వచ్చిన ఈ ‘బిచ్చగాడు 2 ‘ ఆ స్థాయి విజయాన్ని అందుకుందో లేదో తెలుసుకుందాం రండి :

కథ విషయానికి వస్తే.. ‘బిచ్చగాడు’ లో మదర్ సెటిమెంట్ అయితే.. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్ వైపు కథ టర్న్ తీసుకుంది అని ట్రైలర్ చూస్తేనే అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) అనే కోటీశ్వరుడు.. అతని ఆస్తి పై కన్నేసిన విలన్లు…! ఈ క్రమంలో వాళ్ళు విజయ్ ను చంపేయడానికి స్కెచ్ వేయడం.. తర్వాత అతనిలానే ఉన్న మరో వ్యక్తి సత్య(మరో విజయ్ ఆంటోనీ) ని రంగంలోకి దింపడం.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కథ.

ఫస్ట్ హాఫ్ పరంగా సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా కొత్త ఫీల్ ను కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిందో.. వెంటనే ట్రాక్ తప్పింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా పాస్ మార్కులు వేయించుకునే సినిమానే ఇది. విజయ్ ఆంటోనీ తన నటనతో మెప్పించాడు. అతనే హీరో, నిర్మాత, డైరెక్టర్. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బ్లడ్డు పెట్టి పనిచేశాడు అని స్పష్టమవుతుంది. మ్యూజిక్ విషయంలో అయితే బిచ్చగాడు లో ఒకటి రెండు హిట్ సాంగ్స్ పడ్డాయి. కానీ ఇందులోని పాటలు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. కావ్య థాఫర్ కు మంచి రోల్ పడింది. ఆమె వరకు బాగానే చేసింది. దేవ్ గిల్, జాన్ విజయ్ వంటి వారు తమ మార్క్ పెర్ఫార్మన్స్ తో ఓకే అనిపించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

మొత్తంగా.. ‘బిచ్చగాడు 2 ‘.. ‘బిచ్చగాడు’ స్థాయిలో లేకపోయినా కొంతవరకు థ్రిల్ చేస్తుంది. బాగానే ఎంగేజ్ చేస్తుంది. మాస్ ఆడియన్స్ ను ఈ మూవీ ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2.75/5

Read more : anni manchi sakunamule review :’అన్నీ మంచి శకునములే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *