ala ninnu cheri movie review in telugu : ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

News Reviews

విడుదల తేదీ : నవంబర్ 10
తారాగణం : దినేష్ తేజ, పాయల్ రాధా కృష్ణ, హెబ్బా పటేల్, ఝాన్సీ, సద్దామ్ , చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, శివ కుమార్ తదితరులు
దర్శకత్వం : మారేష్ శివన్
సంగీతం : సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫీ : ఆండ్రూ
నిర్మాత : కొమ్మలపాటి సాయి సుధాకర్
నిర్మాణ సంస్థ : విజన్ మూవీ మేకర్స్

ఈ వారం ‘జపాన్’ ‘జిగర్ తండ’ వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి టీజర్లు, ట్రైలర్లు బాగానే ఉన్నాయి కానీ.. మరీ జనాలని థియేటర్లకు రప్పించేంతలా అయితే కాదు. ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే ఫస్ట్ ఆప్షన్ అవే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘అలా నిన్ను చేరి’ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. ‘హుషారు’ తో పాపులర్ అయిన దినేష్ తేజ్ ఇందులో హీరో. అలాగే క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్ కూడా ఓ హీరోయిన్ గా నటించింది. కాబట్టి.. ఈ సినిమాపై కూడా కొందరి దృష్టి పడింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : చెప్పుకోడానికి కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు.వైజాగ్ కి దగ్గర సమీపంలో ఉన్న ఓ గ్రామం. అక్కడ ఓ మిడిల్ క్లాస్ ఫామిలీకి చెందిన గణేష్(దినేష్ తేజ్) అనే కుర్రాడు. అతను స్వతహాగా నాటకాల పిచ్చోడు. ఎప్పటికైనా దర్శకుడు అవ్వాలనేది అతని డ్రీమ్. అయితే ఈలోగా అతని ఊరికి పెళ్లి కోసం వచ్చిన దివ్య(పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వీరి రొమాన్స్ వ్యవహారం ఇంట్లో తెలుసుతుంది. దివ్య తల్లి కాంతం (ఝాన్సీ) ఆమెని తిట్టిపోసి .. లోకల్ పొలిటీషియన్(శత్రు) తో పెళ్లి ఫిక్స్ చేస్తుంది. వీరి పెళ్లిని అడ్డుకోవడానికి గణేష్ వెళ్లగా అక్కడ అతన్ని కొట్టి పారేస్తారు. దీంతో అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అతను కోలుకుని..కెరీర్ పై ఫోకస్ పెడతాడు. దీంతో ఎలాగైనా ఆదర్శకుడవ్వాలనే ఉద్దేశంతో అతను సిటీకి వెళ్తాడు. అక్కడ అను(హెబ్బా పటేల్) తో ఇతనికి పరిచయం ఏర్పడుతుంది. గణేష్ డైరెక్టర్ అవ్వడానికి తన వంతు ప్రయత్నం కూడా ఆమె చేస్తుంది. తర్వాత వీరి మధ్య కూడా ప్రేమ చిగురిస్తుంది. కానీ గణేష్ కి అను ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. అదేంటి? అనేది మిగిలిన కథ.

ఎవరెలా చేశారు అంటే : దినేష్ ఎప్పటిలానే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. డాన్స్ కూడా బాగా చేశాడు. కానీ డైలాగ్ డెలివరీలో మాత్రం ఇతను వీక్ అని చెప్పాలి. హెబ్బా పటేల్ కూడా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతకు మించి ఈమె చేసింది అంటూ ఏమీ లేదు. మరో హీరోయిన్ పాయల్ రాధా కృష్ణ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఈమె లుక్స్ కూడా బాగున్నాయి. ఈమెకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలినవారు జస్ట్ ఓకే.

టెక్నికల్ టీం ఎలా చేశారు : కథ పరంగా ఏమాత్రం కొత్తదనం లేని సినిమా ఇది. దర్శకుడు కేవలం కామెడీ, డైలాగుల పై ఆధారపడి ఈ సినిమాని రూపొందించినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ పరంగా ఓకే. సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది. నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ డిజైన్ వీక్ గా ఉంది.

చివరి మాట : ‘అలా నిన్ను చేరి’ పెద్దగా కొత్తదనం లేని కథ. ఇలాంటి సినిమాలు థియేటర్లలో కష్టం. ఓటీటీకి అయితే ఓకే

రేటింగ్ : 2/5

 

Read more : Ghost Movie Review in Telugu : ‘ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *