14వ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్న మంచు విష్ణు, విరానికా

News

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు అందరికీ సుపరిచితమే. మంచు విష్ణులో ఓ స్పెషాలిటీ ఉంది. ఒకప్పటి సీఎం వై. యస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తె విరానికా రెడ్డిని ఇతను ప్రేమించి 2009 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. ఒక బాబు.. ముగ్గురు పాపలు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మా అధ్యక్షుడిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు ఇతను.అలాగే నిర్మాతగా (24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ), శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల బాగోగులు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఇతని భార్య విరానికా రెడ్డి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ డిజైనర్ గా లండన్, దుబాయ్, దోహ వంటి దేశాల్లో బోటిక్ బిజినెస్ ను నిర్వర్తిస్తుంది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టింది. ఈరోజు మార్చి 1న ఈ దంపతులు తమ 14వ పెళ్లి రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీరి పెళ్లి రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీరి హ్యాపీ ఫ్యామిలీ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *