ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ కు ‘ఎన్టీఆర్ 30 ‘ లో ఛాన్స్

News

ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ తర్వాత మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30 ‘ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు సంబంధించిన ఓ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అతను కూడా ఈ మధ్యనే షూటింగ్లో జాయిన్ అయ్యాడు.

ఇదిలా ఉండగా.. ‘ఎన్టీఆర్ 30 ‘ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లిగా ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ మణి చందన ఎంపికైంది.పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ మూవీ ‘తొలిప్రేమ’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అటు తర్వాత ‘పిల్ల నచ్చింది’ ‘నిజం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. రవితేజ స్టార్ కాకముందు ‘మానసిచ్చాను’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాలో మణిచందన హీరోయిన్ గా నటించింది. ఈమెకు తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా రెండు నిముషాలు, మూడు నిముషాలు నిడివి గల పాత్రలే చేస్తూ వచ్చింది. అలాంటి మణిచందనకి ‘ఎన్టీఆర్ 30 ‘ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లి పాత్ర అంటే ఆమె దశ తిరిగినట్టే..!

Read more : Ugram: ఉగ్రం.. నాంది  కి పదిరెట్లు ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *