హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

News

హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో TV9 Sweet Home ను తెలంగాణ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు HITEX Exhibition Centre లో ఈరోజు ప్రారంభించారు, దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్తానం లో ఉందని, రియల్ ఎస్టేట్ రంగం లో ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో మిగతా నగరాలకంటే ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయన్న్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపనీలను గా సంప్రదించి చిన్న, మధ్యతరగతి, పెద్ద అన్ని వర్గాల వారికీ అందుబాటు ధరల్లో అన్ని అప్రూవల్స్ తో ప్రాపర్టీ కొనాలనుకున్న వారికి ఇది సరైన వేదిక అని అన్నారు. సొంత ప్రాపర్టీ కొనాలకున్న వారు ఈ అవకాశాన్ని వినియోంచుకోవాలని సూచించారు.

TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో.. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అత్యాధునిక ఫర్నిచర్ ఎంపికలు, ఫర్నిషింగ్ బ్రాండ్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, హోమ్ డెకర్ ఆప్షన్‌లతో విస్తృత శ్రేణిని ఈ ఎక్స్ పోలో చూడొచ్చు. అలాగే ఆర్థిక సహాయం పొందాలనుకునే కస్టమర్లు బ్యాంకులు అందించే రుణాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.

TV9 చేపట్టిన ఈ TV9 Sweet Home కార్యక్రమం హైటెక్ సిటీ లోని HITEX Exhibition Centre లో ఆదివారం వరకు జరగనుంది. ప్రవేశం ఉచితం.

Read more : తెల్లపూర్డు డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్‌ లో సందడి చేసిన బుల్లితెర నటులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *