‘ఇంద్రాణి’ సినిమా నుంచి కౌశ‌ల్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌..!!

News

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా ‘ఇంద్రాణి’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు , త‌మిళ‌, మలయాళ, కన్నడ, హిందీ భాష‌ల‌లో ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన ‘ గరిమా కౌశల్’ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ .. ఇంద్రాణిలో గరిమా చాలా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కథ మొత్తం కూడా ఆమె పాత్ర‌ చుట్టూనే తిరుగుతుందని వెల్లడించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డ్రామా, డ్యాన్స్ నంబర్‌, యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా అన్ని స‌మ‌పాళ్ల‌లో మేళవించామన్నారు. తద్వారా భారతదేశంలో మొట్ట‌మొద‌టి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ‘ఇంద్రాణి’ నిలుస్తుంద‌ని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంద్రాణి ప్రధాన కథాంశం గురించి సంగీత దర్శకుడు సాయికార్తీక్‌తో చర్చిస్తుండగా.. ఆయనకి కథ బాగా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు స్టీఫెన్ వ్యాఖ్యానించారు. సేవ్ ద గ‌ర్ల్ టు సేవ్ ద వ‌ర‌ల్డ్‌ (Save the Girl to Save the World) అనే క్యాప్ష‌న్ ఇచ్చి ఈ శీర్షిక ఆధారంగా ప్రత్యేక టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తానని సాయికార్తీక్ హామీ ఇచ్చార‌ని స్టీఫెన్ తెలిపారు.

ప్రస్తుతం ‘ఇంద్రాణి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, స్టీఫెన్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌రు 27వ తేదీన ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *