‘దసరా’ 2 వారాల కలెక్షన్స్.. అక్కడ మాత్రం కష్టమే..!

Collections Uncategorized

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘నేను లోకల్’ తర్వాత వచ్చిన చిత్రం ‘దసరా’. ఈ మూవీ రిలీజ్ అయ్యి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. కొత్త కుర్రాడు, సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మార్చ్ 30న విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. మొదటి రోజు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ చిత్రం రెండో వారంలో కొంచెం స్లో అయ్యింది. అయినా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 2 వారాల కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం : 24.98 కోట్లు
సీడెడ్ : 5.20 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.35 కోట్లు
ఈస్ట్ : 2.19 కోట్లు
వెస్ట్ : 1.23 కోట్లు
కృష్ణా : 2.06 కోట్లు
గుంటూరు : 2.39 కోట్లు
నెల్లూరు :0.91 కోట్లు
——————————————————–
ఏపీ + తెలంగాణ : 43.31 కోట్లు
కర్ణాటక(రెస్ట్ ఆఫ్ ఇండియా) : 4.62 కోట్లు
మిగతా భాషల్లో : 1.52 కోట్లు
హిందీ : 1.95 కోట్లు
ఓవర్సీస్ : 10.42 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 61.82 కోట్లు (షేర్)

 

‘దసరా’ కి జరిగిన థియేట్రికల్ బిజినెస్ వివరాలు గమనిస్తే :

 

నైజాం : 13 కోట్లు
సీడెడ్ : 6.3 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.4 కోట్లు
ఈస్ట్ : 2.3 కోట్లు
వెస్ట్ : 1.95 కోట్లు
కృష్ణా : 2.2 కోట్లు
గుంటూరు : 2.4 కోట్లు
నెల్లూరు : 1.0 కోట్లు
——————————————————–
ఏపీ + తెలంగాణ : 32.55 కోట్లు
కర్ణాటక : 2.0 కోట్లు
తమిళనాడు : 1.2 కోట్లు
కేరళ : 0.3 కోట్లు
రెస్ట్ : 5 కోట్లు
ఓవర్సీస్ : 6 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 47.05

 

‘దసరా’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.61.82 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.13.82 కోట్ల లాభాలను అయితే అందించింది కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం ‘దసరా’ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. తెలంగాణ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. అక్కడి బయ్యర్లు భారీగా లాభాలు పొందారు.ఇదే జోష్ లో టైర్-2 హీరోల్లో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ పేరిట ఉన్న రికార్డుని ‘దసరా’ బ్రేక్ చేస్తుంది అనుకుంటే అలా జరగలేదు. ‘గీత గోవిందం’ చిత్రం రూ.70 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. కానీ ‘దసరా’ మాత్రం రూ.61 కోట్ల దగ్గర మాత్రమే ఆగిపోయింది. ఆంధ్రాలో ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ముఖ్యంగా సీడెడ్ అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చాలా రాబట్టాల్సి ఉంది. ‘దసరా’ సినిమాలో మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే కామెడీ వంటి ఎలిమెంట్స్ మిస్ అవ్వడం కూడా ‘దసరా’ కి.. టికెట్లు తక్కువ తెగడానికి కారణం అయ్యిందని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాలో ‘ఆర్య’ ‘రంగస్థలం’ వంటి కథలు మిక్స్ అయ్యి ఉండటం కూడా కొంత మైనస్ అని చెప్పుకోవాలి.

 

Read more : Dasara review : దసరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *